మేం అడవిని.. విడిచిపెట్టం! | - | Sakshi
Sakshi News home page

మేం అడవిని.. విడిచిపెట్టం!

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● స్పష్టం చేసిన తేని జిల్లా మేఘమలై ప్రజలు ● నిరసన బాట

సాక్షి,చైన్నె : తేని జిల్లా పరిధిలోని మేఘమలై కొండ గ్రామాల్లో పట్టాలు లేని కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నాలను నిరసిస్తూ స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు బాటపట్టారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో కొండ గ్రామ ప్రజలంతా ఏకమై కడమలైకుండు బస్టాండ్‌ ప్రాంతంలో నిరంతర నిరీక్షణ నిరసనకు శనివారం శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం వెంటనే పునర్‌ సమీక్షా పిటిషన్‌ దాఖలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ తరతరాల నివాసాలను, అడవిని విడిచిపెట్టేది లేదంటూ తేల్చిచెప్పారు. సెప్టెంబర్‌ 29న ఈ మేఘమలై కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ రానున్న నేపథ్యంలో, ఆ తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన తీవ్రత దృష్ట్యా ఎస్పీ ప్రవీణ్‌ గౌతమ్‌ స్వయంగా నిరసన ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కదమలైకుండు, వరుసనాడు, మైలదుంపరై, తంగమ్మాళ్‌పురం, మూలక్కడై, కుమనంతోజు గ్రామాల్లోని 6 టాస్మాక్‌ దుకాణాలను నిరసన జరిగే రోజుల వరకు తాత్కాలికంగా మూసివేశారు. తుమ్మకుండు గాంధీగ్రామం, శీలముత్తయ్యపురం, వండియూర్‌, ఇందిరా నగర్‌ సహా చుట్టుపక్కల ఉన్న 98 కొండ గ్రామాల ప్రజలు ఈ నిరసనలో పాల్గొని తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement