ఐఐటీ మద్రాస్‌ కీలక అడుగు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ మద్రాస్‌ కీలక అడుగు

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● డీప్‌–టెక్‌ స్టార్టప్‌ల కోసం రూ. 600 – 1,000 కోట్లు ● వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ప్రారంభం

సాక్షి, చైన్నె: భారతదేశపు డీప్‌–టెక్‌ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఐఐటీ మద్రాస్‌ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఐఐటీ–ఎం రీసెర్చ్‌ పార్క్‌ , యూనికార్న్‌ ఇండియా వెంచర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐఐటి మద్రాస్‌ యూనికార్న్‌ ఫ్రాంటియర్‌ ఫండ్‌ ఐ తొలి నిధుల సమీకరణ రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు శనివారం చైన్నెలో ప్రకటించారు. ఐఐటి మద్రాస్‌ ఎకోసిస్టమ్‌ నుండి వెలువడే డీప్‌–టెక్‌ స్టార్టప్‌లకు దీర్ఘకాలిక మూలధనాన్ని అందించడానికి రూ. 600 నుండి రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఈ ఫండ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

పూర్వ విద్యార్థుల భారీ స్పందన

ఈ కార్యక్రమానికి ఐఐటి మద్రాస్‌ పూర్వ విద్యార్థులు అత్యంత ఉత్సాహాన్ని చూపారు. కేవలం పూర్వ విద్యార్థుల నుంచే రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడులు రావడం విశేషం. బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్‌ పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సదస్సు సంగమ్‌ 2026 వేదికగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ సమక్షంలో ఐఐటి మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి ఈ ఫండ్‌ వివరాలను, తొలి దశలో నిధులు అందుకునే స్టార్టప్‌ల జాబితాను ప్రకటించారని వివరించారు.

ఎవరి కోసం ఈ నిధి?

దేశాన్ని వికసిత్‌ భారత్‌ 2047 దిశగా నడిపించడంలో, స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా ఎదగడానికి ఈ మూలధనం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకటించారు. ప్రధానంగా రోబోటిక్స్‌, స్పేస్‌ టెక్నాలజీ, డిఫెన్స్‌ టెక్నాలజీ మరియు సెమీకండక్టర్లు వంటి అత్యాధునిక రంగాలలో మేధో సంపత్తి ఆధారంగా పనిచేసే ఇంజనీరింగ్‌–కేంద్రీకృత స్టార్టప్‌లపై ఈ ఫండ్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వివరించారు. టెక్నాలజీ రెడీనెస్‌ లెవెల్స్‌ 3–4 దశల్లో ఉన్న ప్రాథమిక స్థాయి డీప్‌–టెక్‌ కంపెనీలకు ఈ నిధి నుంచి సుమారు 60% కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని తదుపరి రౌండ్‌ పెట్టుబడుల కోసం ఉంచుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement