– ప్రారంభించిన సీఎం రంగస్వామి
సాక్షి, చైన్నె : ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ గిరి ట్రేడింగ్స్ పుదుచ్చేరిలో తన సేవలకు శ్రీకారం చుట్టింది. సీఎం రంగస్వామి ఆధ్యాత్మిక ట్రేడింగ్ కొత్త శాఖను ప్రారంభించారు. పుదుచ్చేరిలో ప్రసిద్ధ ఈశ్వరన్ ఆలయానికి ఎదురుగా ఈ శాఖను ఏర్పాటు చేశారు. సీఎం రంగస్వామి చేతలు మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి , ఆథ్యాత్మిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు, మధురై ఆధీనం, గిరి డైరెక్టర్లు శారదా ప్రకాష్, శ్రీనివాసన్, సేల్స్ హెడ్ అమర్‌గీరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రంగాసామి మాట్లాడుతూ, పుదుచ్చేరి ప్రజలందరికీ ఒకే చోట అన్ని రకాల ఆధ్యాత్మిక పూజా వస్తువులు లభించడం అభినందనీయమని, ఈశ్వరన్ ఆలయానికి ఎదురుగా ఇది ఏర్పాటు చేయడం మరింత విశేషమని అన్నారు. ఆధ్యాత్మిక అభివృద్ధిలో గిరి సేవలు ఎంతో కీలకమని కొనియాడారు. మధురై ఆధీనం మాట్లాడుతూ, ధర్మాన్ని పెంపొందించడానికి అందరూ కలిసి కృషి చేయాలని, గిరి అందిస్తున్న వివిధ ఆధ్యాత్మిక ఉత్పత్తుల ద్వారా సనాతన ధర్మం మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేసి వారి సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.


