● నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు ఊరట ● కేసు కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

● నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు ఊరట ● కేసు కొట్టివేత

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు ఊరట ● కేసు కొట్టివేత

కరోనా వ్యాక్సిన్‌ వివాదం

సాక్షి, చైన్నె : కరోనా వ్యాక్సిన్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై నమోదైన కేసును మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. 2021లో కోవిడ్‌ మహమ్మారి సమయంలో, నటుడు వివేక్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన మన్సూర్‌ అలీ ఖాన్‌ ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాటు, ఇవి ప్రభుత్వ వ్యాధి నివారణ చర్యలకు విరుద్ధంగా ఉన్నాయని కోడంబాక్కం జోనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ భూపేష్‌ వడపళని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ప్రజాశాంతికి భంగం కలిగించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైకోర్టు తీర్పు: ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మన్సూర్‌ అలీ ఖాన్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను వ్యాక్సిన్‌పై ఎలాంటి నిందలు వేయలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ జి.కె. ఇలంధిరియన్‌ , మన్సూర్‌ అలీ ఖాన్‌పై వడపళని పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement