జెమ్‌ వీరమణిపై మరికొందరి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

జెమ్‌ వీరమణిపై మరికొందరి ఫిర్యాదు

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

– నిందితులపై

పోలీసుల ప్రశ్నల వర్షం

సాక్షి, చైన్నె: తమిళనాడులో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలికలపై లైంగిక దాడి కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జెమ్స్‌ గ్రానైట్స్‌ యజమాని వీరమణితో పాటు, అతనికి సహకరించారనే ఆరోపణలతో అరెస్టయిన శాంతి, ఆమె భర్త మహేంద్రసింహన్‌ను పోలీసులు రెండో రోజుగా శనివారం కూడా తీవ్రంగా విచారించారు. కాగా నిందితులు శాంతి, మహేంద్రసింహన్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తూ, ఏకంగా 200లకు పైగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. వీరమణితో వీరి అనుబంధం ఎంతకాలం నుండి ఉంది? అమ్మాయిలను ఎలా రప్పించారు? మధ్యవర్తులు ఎవరు? బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో లోతుగా ఆరా తీశారు. ఈ విచారణ అంతా పారదర్శకంగా ఉండేందుకు, కోర్టులో కీలక సాక్ష్యంగా సమర్పించేందుకు పోలీసులు పూర్తి ప్రక్రియను వీడియో రూపంలో రికార్డ్‌ చేశారు. అంతేకాకుండా, నేరాలు జరిగిన నిర్దిష్ట ప్రాంతాలకు నిందితులను నేరుగా తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అలాగే, ఈకేసుకు సంబంధించిన సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేత రంజన్‌కుమాఱ్‌ వద్ద సైతం తొమ్మిది గంటల పాటుగా విచారణ జరగడం గమనార్హం. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం అవుతున్న తరుణంలో, తాజాగా మరో ముగ్గురు యువతులు కూడా వీరమణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాగా, ఈ కేసును గతంలో తొక్కి పెట్టేందుకు సుమారురూ. 500 కోట్ల మేరకు లంచాలు తాండవం చేశాయని మంత్రి నిర్మల్‌కుమార్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement