ఘనంగా వీఐటీ మారిషస్‌ ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వీఐటీ మారిషస్‌ ఉత్సవం

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

ఘనంగా వీఐటీ మారిషస్‌ ఉత్సవం

వేలూరు: వీఐటీ యూనివర్సిటీ మారిషస్‌ తన ప్రథమ సంవత్సర ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. వేలూరు వీఐటీ చాన్స్‌లర్‌ విశ్వనాథన్‌ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ శేఖర్‌ విశ్వనాథన్‌, వీఐటీ కార్యనిర్వహణ డైరెక్టర్‌ సంధ్యా పెంటారెడ్డి కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంజినీరింగ్‌ పథకాలకు సంబంధిచిన ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు ప్రస్తుత ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు సంబంధించిన పథకాలను అందజేశారు. ఈ ప్రదర్శన విద్యార్థుల మేధోశక్తి, తరగతిలో ఏ విధంగా బోధన చేయాలని, ప్రస్తుత సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చూడాలనే విషయం పొందు పరిచి ఉంది. వీఐటీ మొరిసీయస్‌ అంతర్జాతీయ ప్రదర్శనను ఇండియా ప్రొత్సహిస్తుంది. ఇండియా, ఆఫ్రికా, మారిషస్‌ , మిడిల్‌ ఈస్ట్‌ ఇండియా వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాలకు సంప్రదాయ పద్ధతులను వీఐటీ మారిషస్‌ అనుసరిస్తుంది. అనంతరం వీఐటీ చాన్సలర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ వీఐటీ మారిషస్‌ అభివృద్ధిలో తాను గర్విస్తున్నట్లు, విద్యార్థులు రానున్న సమాజానికి అవసరమైన భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. ఇందులో సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు అవార్డులను అందజేసి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement