క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

1న వామపక్షాల ధర్నా కేరళ కార్మికుడి అనుమానాస్పద మృతి పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరవచ్చు ప్రైవేటు బస్సు యజమానుల మౌనదీక్ష విద్యార్థినికి లైంగిక వేధింపులు ● ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం అరెస్టు

కొరుక్కుపేట: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలనే నినాదంతో అక్టోబర్‌ 1న జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నట్లు వామపక్ష పార్టీ నాయకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రజాసామ్య పరిరక్షణ కోసం ఈ చర్య ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

తిరువళ్లూరు: కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాకు చెందిన శ్రీకుమార్‌తో పాటు నలుగురు కార్మికులు సివీ నాయుడు రోడ్డులో ఎగ్జిబిషన్‌ టెంట్‌ వేసే పనుల్లో నిమగ్నమైయ్యారు. మద్యం సేవించే అలవాటు వున్న శ్రీకుమార్‌ గత 19న మద్యం సేవించి అదేరోజు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనపై సహాచర కార్మికులు తిరువళ్లూరు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పూండి యూనీయన్‌ ఒదికాడు చెరువులో గుర్తు తెలియని విధంగా కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం వున్నట్టు స్తానికులు వీఏఓ విఘ్నేష్‌కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తులో మృతుడు ధరించిన దుస్తుల ఆధారంగా కేరళకు చెందిన శ్రీకుమార్‌గా అతడి బంధువులు గుర్తించారు.

వేలూరు: పట్టుదలతో ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని గ్రాండ్‌ కాంటినెంట్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ శివ అన్నారు. శనివారం ఉదయం వేలూరు గ్రీన్‌ సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన గ్రాండ్‌ కాంటినెంట్‌ హోటల్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేలూరు పట్టణంలో బంగారుగుడి, సీఎంసీ ఆసుపత్రి, వీఐటీ యూనివర్శిటీ వంటివి ఉండటంతో మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా వేలూరు పట్టణానికి వచ్చి వెలుతుంటారని దీంతోనే వేలూరు గ్రీన్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఈ హోటల్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. సమావేశంలో హోటల్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ స్వామినాధన్‌, విద్యారమేష్‌, నిర్వహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేలూరు: మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంలో ప్రైవేటు బస్సులను కూడా చేర్చాలని కోరుతూ వేలూరు జిల్లా ప్రైవేటు బస్సు యజమానుల సంఘం అద్వర్యంలో వేలూరులోని అన్నా రోడ్డులో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ప్రవేటు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం ముందుస్తుగా ఉన్న 12 సీట్లుకు సరిపడే నగదును కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు పథకం ప్రకటించడంతో ప్రైవేటు బస్సులను నడపలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈ వృత్తిని నమ్ము కొని పలు లక్షల సంఖ్యలో డ్రైవర్‌లు, కండెక్టర్‌లు, కార్మికులు, క్లీనర్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు జీవిస్తున్నారన్నారు. దీంతో ప్రవేటు బస్సుల యజమానులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మౌన దీక్షలో వేలూరు జిల్లా ప్రైవేటు బస్సు యజమానుల సంఘం అధ్యక్షులు గణేశన్‌, కోశాధికారి రవి, మాజీ అధ్యక్షులు విజయ్‌ గోవిందరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నానగర్‌: ఆరో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తిరుపోరూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోక్సో కేసులో అరెస్టు చేశారు. అలాగే విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. వివరాలు.. తిరుపోరూర్‌ సమీపంలోని ఎడలంలోని భారతి నగర్‌ ప్రాంతానికి చెందిన థామస్‌ మనోహరన్‌ (52). తిరుపోరూర్‌ లోని చెంగల్‌పట్టు రోడ్డులోని సెమ్‌ బాక్కం పంచాయతీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. ఈ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న విద్యార్థి నిని థామస్‌ మనోహరన్‌ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. విద్యార్థిని ఏడుస్తూ తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించడంతో, వారు తీవ్ర ఆగ్రహానికి గురై సింగపెన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఫిర్యాదు చేశారు. దీని తర్వాత, తిరుపోరూర్‌ సింగపెన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సబ్‌–ఇనన్‌స్పెక్టర్‌ కన్నగి పాఠశాలలో విచారణ జరిపి నివేదికను మామల్లపురం ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషనన్‌కు పంపారు. దాని ఆధారంగా, మామల్లపురం మహిళా పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు బాధితురాలైన పాఠశాల విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను విచారించారు.ఆ తర్వాత వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, థామస్‌ మనోహరన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సెంబాక్కం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం థామస్‌ మనోహరన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement