తమిళసినిమా: డాక్టర్ అయ్యి యాక్టర్స్ అయిన నటి శ్రీలీల. తెలుగులో పెళ్లి సందడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఈ కన్నడ బ్యూటీ, తొలి చిత్రంతోనే తన అందం, డాన్స్‌లతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత చిన్న గ్యాప్ వచ్చినా, ధమాకా చిత్రంలో రవితేజతో జత కట్టి మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అదే విధంగా నటుడు మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అదేవిధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్న ఈ భామకు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా ఇటీవల పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ అయిన శ్రీ లీల నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం ధనుష్ కు జంటగా ఓం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ శ్ఙ్రీ ఏ భాషలో నటించినా ఆ భాషాకు చెందిన అభిమానులను ఆకట్టుకోవాలి. నేను తెలుగులో అదే చేశాను. ఇప్పుడు తమిళ సినీ అభిమానులపై గురి పెట్టాను. గుర్తు పెట్టుకోండి. కచ్చితంగా నేను తమిళ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటాను శ్ఙ్రీఅని నటి శ్రీలీల చాలా నమ్మకంతో పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


