మండవెట్టి చిత్రం నుంచి రాక్షసియే పాట | - | Sakshi
Sakshi News home page

మండవెట్టి చిత్రం నుంచి రాక్షసియే పాట

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

మండవెట్టి చిత్రం నుంచి రాక్షసియే పాట

తమిళసినిమా: చరణ్‌ రాజ్‌ సెంథిల్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో తస్కర్స్‌ డెన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం మండవెట్టి. నటి కోమలి ప్రసాద్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రం సూపర్‌ నాచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం టీజర్‌ ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందనో యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా ఇప్పుడు చిత్రంలోని రాక్షసియే అనే పల్లవితో సాగే సింగిల్‌ సాంగ్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పాటను జాతీయ అవార్డు గ్రహీత గాయని వైకం విజయలక్ష్మి పాడినట్లు తెలిపారు. గీత రచయిత తమిళ్‌ మణి రాసిన ఈ పాటను దీపక్‌ వేణుగోపాల్‌ సంగీత బాణీలను కట్టినట్లు చెప్పారు. ఒక మర్మమైన యువతి చుట్టూ తిరిగే ఈ పాటను విన్న వారిని అది మండవెట్టి ప్రపంచంలోకి తీసుకెళుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలు మార్మాలతో నిండిన దాడి పుట్టించే కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర కథ గ్రామీణ ప్రాంతంలోని సెంజీసామి నేపథ్యంలో అమానుష్య ఘటనలు ప్రపంచంలో ఈ చిత్రం తీసుకెళుందని పేర్కొన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఈ ఏడాది మంచి ప్రేక్షకాదరణ లభిస్తోందన్నారు. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరుతుందే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ట్రైలర్‌, ఆడియో విడుదల తేదీని, అదే విధంగా చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement