సాక్షి, చైన్నె: వుడ్–బేస్డ్ ప్యానెల్ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యాక్షన్ టెసా నేతృత్వంలో జాతీయ వడ్రంగుల దినోత్సవం న్విహించారు. ఈ సందర్భంగా వడ్రంగుల కుటుంబాలకు ఊతమిచ్చేలా పలు బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను అందజేశౠరు. 50కి పైగా ప్రాంతాల్లో శ్ఙ్రీసంగ్ సంగ్ చలేన్, ఆగే బధేన్‌శ్రీశ్రీ అనే నినాదంతో మరింత విస్తృతంగా నిర్వహించారు. ఫర్నీచర్ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న వడ్రంగుల సంక్షేమం కోసం యాక్షన్ టెసా 2026–27 సంవత్సరానికి గాను నాలుగు కీలక పథకాలను ప్రకటించారు. ఇందులో వడ్రంగుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి కోసం రూ. 50,000 వరకు విలువైన యాక్షన్ టెసా ఫర్నిచర్ ప్యాకేజీ రూపంలో ఆర్థిక సహాయం అందించబడుతుందన్నారు. వడ్రంగుల పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించడానికి రూ. 11,000 చొప్పున విద్యావేతనంగా అందజేస్తామని, ఎంఎస్‌ఎంఈలతో కలిసి సూపర్ 30 చొరవ కింద ఎంపికై న వారికి మూడు నెలల పాటు ఉచిత నివాస, భోజన వసతితో కూడిన రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామన్నారు.సభ్యులందరికీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పిస్తామని వివరించారు. ఈ ప్రయోజనాలన్నింటినీ టెసా కనెక్‌ట యాప్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. అలాగే, వడ్రంగుల సహాయం కోసం ప్రత్యేకంగా 1800–309–0707 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచామని యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ ఈసందర్భంగా ప్రకటించారు.


