నటుడు రాజ్‌కిరణ్‌కు ఊరట | - | Sakshi
Sakshi News home page

నటుడు రాజ్‌కిరణ్‌కు ఊరట

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

సాక్షి, చైన్నె: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత రాజ్‌కిరణ్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా అడ్వాన్స్‌ డబ్బుల వివాదానికి సంబంధించిన కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 2022 ఏప్రిల్‌లో మింజూర్‌ ప్రాంతానికి చెందిన నిర్మాత శరవణన్‌, ఒక సినిమా నిర్మాణ నిమిత్తం నటుడు రాజ్‌కిరణ్‌కు రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే అనుకున్న విధంగా సినిమా ప్రారంభం కాలేదు. దీనిపై నిర్మాత సంఘంలో జరిగిన చర్చల ఆధారంగా, 2025 ఆగస్టులో రాజ్‌కిరణ్‌ రూ. 10 లక్షలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన రూ. 40 లక్షలు చెల్లించలేదంటూ నిర్మాత శరవణన్‌ పోలీసులను ఆశ్రయించారు. పొన్నేరి మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వుల మేరకు, గత ఏడాది ఆగస్టు 28న మీంజూర్‌ పోలీసులు రాజ్‌కిరణ్‌పై కేసు నమోదు చేశారు.

హైకోర్టు విచారణ – తీర్పు

ఈ కేసులో తనను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోరుతూ రాజ్‌కిరణ్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పూర్తిగా సివిల్‌ స్వభావం గల వివాదమని, దీనికి క్రిమినల్‌ రంగు పులమడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషనన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. రమేష్‌, నటుడు రాజ్‌కిరణ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, షరతు ప్రకారం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో 15 రోజుల పాటు రోజూ హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement