తిరనువళ్లూరు: దేశ భవిషత్తును తీర్చిదిద్డడంలో ఇంజనీరింగ్ విద్య కీలక పాత్రను పోషిస్తూ వుందని ఆర్‌ఎంకే విద్యాసంస్థ అధినేత ఆర్‌ఎస్ మునిరత్నం వ్యాఖ్యానించారు. జాతీయ ఇంజనీర్లు దినోత్సవం–2026 వేడుకల్లో భాగంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా, తిరువళ్లూరు లోకల్ సెంటర్, ఆర్‌ఎంకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ వింగ్ ఆద్వర్యంలో ఐఈఐ టీవీఎల్‌సీ టెక్నాలజీ–2026 ఫెస్టివల్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎంకే విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు విద్యారత్న ఆర్‌ఎస్ మునిరత్నం అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విధ్యలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి మొక్క ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. అనంతరం ఇంజనీరింగ్ విద్య, సంస్థాగత అబివృద్ధిలో ఆర్‌ఎస్ మునిరత్నం చూపిన చొరవకు విశిష్ట నాయకత్వ పురస్కారాన్ని ఐఈఐ నిర్వాహకులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంధ్రం మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రంగనాథన్ పాల్గొన్నారు. ఆర్‌ఎంకే విద్యాసంస్థల సలహాదారుడు మాజీ వీసి డాక్టర్ పళణీస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్‌కుమార్, డీన్‌లు డాక్టర్ రామర్, డాక్టర్ శివరామ్ పాల్గొన్నారు.


