సాక్షి,చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ సీఎం విజయ్ తన తమిళగ వెట్రి కళగం(టీవీకే)లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులతో పాటు మొత్తం 11 మంది మాజీ మంత్రులకు టీవీకే పార్టీలో అత్యున్నత పదవులు కట్టబెట్టారు. అన్నాడీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి వచ్చిన వారికి తొలుత కాస్త జాప్యంతో పదవులు అప్పగించారు. అయితే మాజీలకు ఎలాంటి పదవులు కట్టబెట్టక పోవడంతో అసంతృప్తి బయలు దేరినట్లయ్యింది. దీనిని పరిగణించిన టీవీకే అధినేత విజయ్ సంస్థాగతంగా పార్టీ పరంగా మార్పులు చేస్తూ, కొత్త పదవులను సృష్టించడమే కాకుండా, మరికొన్ని కీలక పదవులలో మాజీలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పదవుల కేటాయింపు
అన్నాడీఎంకే నుంచి వచ్చిన మాజీ మంత్రులకు టీవీకే డిప్యూటీ జనరల్‌సెకట్రరీ (ఉప ప్రధాన కార్యదర్శులు) పదవులు దక్కాయి. ఇందులో ఎం.ఎస్.ఎం. ఆనంద్, ఎం.సి. సంపత్, ఉడుమలై రాధాకృష్ణన్, కె.వి. రామలింగం, ఎం. ఆనందన్, కడంబూర్ రాజు, కె.టి. పచ్చమాల్, వెల్లమండి నటరాజన్, ఎన్.ఆర్. శివపతి, వైగై సెల్వన్, ఎస్. వలర్మతి ఉన్నారు. వీరితో పాటు మరికొందరికి కూడా పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఉప ప్రధాన కార్యదర్శులుగా సందీప్ ఆనంద్, కె.జి. ముత్తు వెంకటేశ్వరన్, తొల్లమూర్ కన్నన్, వి.సి.ఆర్. కుమరన్ నియమితులయ్యారు. ఇక జిల్లా కార్యదర్శి పదవులలో కూడా అవకాశం కల్పించారు. మడతుకులం నియోజకవర్గ పరిధిలోని తిరుపూర్ సబర్బన్ సౌత్ జిల్లా కార్యదర్శిగా సి. మహేంద్రన్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతం కోసం కొత్తగా నియమితులైన వారికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నిర్వాహకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పూర్తి సహకారం అందించాలని సీఎం విజయ్ కోరారు.
మాజీలకు పదవులు
నియమకం


