ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మోత్సవ శోభ | - | Sakshi
Sakshi News home page

ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మోత్సవ శోభ

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

పళ్ళిపట్టు: పొదటూరుపేట టౌన్‌ పంచాయతీలోని ఎగువ పొదటూరులో ప్రసిద్ది చెందిన శ్రీదేవి, భూదేవి సమతే కళింగ ధరణి వరాహస్వామి ఆలయంలో ఏటా పెరటాసి మానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం పరిపాటి. 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన వేడుకల్లో భాగంగా రోజూ స్వామికి విశేష అభిషేక ఆరాధన పూజలతో పాటు ఉత్సవర్ల వాహన సేవలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఇందుకోసం స్వామికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, పూజా సామాగ్రిని ఉభయదారులు వడివేలు రెడ్డి రాజేశ్వరి దంపతులు వారి కుటుంబీకులు మేళ తాళాలతో ఆలయంకు తీసుకొచ్చి భట్టాచ్చార్యుల బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి ఽభూదేవి సమేత శ్రీవారి కల్యాణోత్సవం కమనీనంగా సాగింది. ఇందులో పళ్ళిపట్టు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారు గజ వాహన సేవలో కొలువుదీరి గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement