మళ్లీ తమిళ్‌ తాయ్‌ వాల్తు వివాదం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తమిళ్‌ తాయ్‌ వాల్తు వివాదం

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

మూడో స్థానానికి రాష్ట్ర గీతం

సర్వత్రా ఆగ్రహం

మనోన్మణియం సుందరనార్‌ వర్సిటీలో గందరగోళం

సాక్షి, చైన్నె: తమిళ తాయ్‌ వాల్తు (తమిళ తల్లిగీతం) రాసిన మనోన్మణియం సుందరనార్‌ పేరిట ఉన్న విద్యా సంస్థలోనే రాష్ట్ర గీతంకు ప్రాధాన్యత కరువైంది. మూడో స్థానానికి రాష్ట్ర గీతం నెట్టబడటంతో సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాదం నేపథ్యంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ హాజరైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించింది. వివరాలు.. తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్‌ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. రాజ్‌భవన్‌ ఆదేశాల మేరకు స్నాత్కోత్సవంలో ప్రార్థనా గీతాల క్రమాన్ని ఈ వేడుకలో మర్చారు. మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, మూడో స్థానంలో తమిళ్‌ తాయ్‌ వాల్తు పాడేలా ప్రణాళిక రూపొందించారు. తమిళ్‌ తాయ్‌ వాల్తు గీతాన్ని రాసిన మనోన్మణియం సుందరనార్‌ పేరిట ఉన్న విశ్వ విద్యాలయములోనే రాష్ట్ర గీతాన్ని మూడో స్థానం ఇచ్చి అవమానించారన్న విమర్శలు, ఆగ్రహాలు బయలు దేరాయి. రాష్ట్రంలోని కార్యక్రమాలలలో తమిళ్‌ తాయ్‌ వాల్తుకు తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా , రాజ్‌ భవన్‌ ఆదేశాలకు ఆ వర్సిటీ వీసీ చంద్రశేఖర్‌ తలొగ్గక తప్పలేదు.

సర్వత్రా ఆగ్రహం

డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, గ్రాడ్యుయేషన్‌ ఉత్సవ వేడుకలో సాధారణంగా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తమిళ్‌ తాయ్‌ వాల్తును మూడో సారిగా మూడో స్థానంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళ సంస్కృతిని, మాతృగీతాన్ని అవమానించడమేనంటూ ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరగడం నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్‌ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు గవర్నర్‌ పాల్గొన్న ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించడం గమనార్హం.

తమిళనాడులో రాష్ట్రగీతానికే ప్రథమ స్థానం: తమిళనాడులో తమిళ్‌ తాయ్‌ వాల్తుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో రాజ్‌ భవన్‌ భిన్నమైన మార్గదర్శకాలను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని న్యాయ శాఖ మంత్రి నిర్మల్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైన్నెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ పాలిత పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల మాతృగీతాలనే మొదట ఆలపిస్తున్నారని, అయితే, తమిళనాడులో దానికి భిన్నంగా చేయడం మంచి పద్దతి కాదన్నారు. ్ట తమిళనాడులో తమిళ మాతృగీతానికే మొదటి స్థానం ఇవ్వాలన్నారు.

ఆ గీతాన్ని రాసిన

సుందరనార్‌కు దక్కని గౌరవం

విద్యార్థుల నిరసన

గవర్నర్‌ అర్లేకర్‌ హాజరైన ఈ కార్యక్రమంలోఓ వైపు తమిళ్‌ తాయ్‌ వాల్తు వివాదం, మరో వైపు విద్యార్థులకు పట్టాల ప్రదానం వివాదం బయలు దేరింది. మొదట 871 మందికి గవర్నర్‌ స్వయంగా పట్టాలు ప్రధానం చేస్తారని ప్రకటించారు. అయితే, , చివరి నిమిషంలో కేవలం 113 మంది గోల్డ్‌ మెడలిస్ట్‌ వర్గాలకే పరిమితం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు, పీహెచ్‌డీ పట్టదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకలో తిరుచెందూరు ఆదిత్యనార్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండేసి బంగారు పతకాలను దక్కించుకున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా శాఖమంత్రి విశ్వనాథన్‌ బహిష్కరించారు. అదే సమయంలో డీజీపీ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ సైతం దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. అయితే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా బహిష్కరించలేదని, అధికారుల గైర్హాజరీ వెనుక కేవలం రవాణా, పరిపాలనాపరమైన శోధనలు , భద్రతా కారణాలే ఉన్నాయని డీజీపీ వివరణ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement