మణిక్యం ఠాకూర్‌పై కేసు కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

మణిక్యం ఠాకూర్‌పై కేసు కొట్టివేత

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● 31వ తేదీ నుంచి మూత పడనున్న పౌల్ట్రీ దుకాణాలు

– కోర్టు ఉత్తర్వు

కొరుక్కుపేట:తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు లు మణిక్యం ఠాకూర్‌ పై 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తరపున విరుదునగర్‌ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు విరుదునగర్‌ వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమిళనాడు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణి క్యం ఠాకూర్‌ ఈ కేసు విచారణను నిలిపివేయాల ని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఇలంధిరాయ న్‌ ముందు విచారణకు వచ్చింది. ఇంతకుముందు, పిటిషనర్‌ తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో, సంబంధిత న్యాయాధికార సంస్థ కేసు నమోదు చేయడానికి కోర్టు నుండి ముందస్తు అనుమతి పొందాలని, అయితే ఈ కేసులో పోలీసులు అలా చేయకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కొట్టివేయాలి కోరారు. దీంతో న్యాయమూర్తి మణిక్యం ఠాకూర్‌పై ఉన్న కేసును కొట్టివేయాలని ఆదేశించారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో..

కొరుక్కుపేట:తంజావూరులో తమిళనాడు పౌల్ట్రీ వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు దురైరాజ్‌ మాట్లాడుతూ పౌల్ట్రీ ఉత్పత్తి సంస్థలు మేతతో పాటు బతికున్న కోళ్లను పంపిస్తుండటం వల్ల మాంసం నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. దీనివల్ల ఆహార భద్రత, పరిశుభ్రత, పౌల్ట్రీ వ్యాపారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందువల్ల, మేత నియంత్రణ చర్యలను అమలు చేయాలని తమిళనాడు అభ్యర్థించింది. దీంతో 31వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా దుకాణాలను మూసివేసి చికెన్‌ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని, దీనివల్ల రోజూ జరిగే 6 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలపై ప్రభావం పడుతుందన్నారు. తమకు మద్దతుగా, వారు పుదుచ్చేరి రాష్ట్రంలో దుకాణాలను మూసివేసి, చికెన్‌ అమ్మకాలను నిలిపివేస్తామని ప్రకటించారు. కేరళ రాష్ట్ర సంఘం కూడా తమ మద్దతును తెలియజేసింది. 31వ తేదీలోగా మా డిమాండ్లపై తగిన చర్యలు తీసుకుంటే నిరసనను విరమించుకుంటామని వారు తెలిపారు.

చైన్నెలో మౌళి–ఏ టైమ్‌లెస్‌ ట్రెడిషన్‌ నృత్య రూపకం

సాక్షి, చైన్నె: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భరతనాట్య విద్వాంసురాలు, పరిశోధకురాలు బాలాదేవి చంద్రశేఖర్‌ తమ ప్రతిష్టాత్మక నృత్య రూపకం మౌళి – ఏ టైమ్‌లెస్‌ ట్రెడిషన్‌ను ఆగస్టు 2న చైన్నెలో ప్రదర్శించనున్నారు. ఇందుకు వేదికగా తిరువాన్మియూర్‌లోని భరతకళాక్షేత్ర ఆడిటోరియాన్ని ఎంపిక చేశామని నిర్వాహకులు ప్రకటించారు. బాలా దేవి చంద్రశేఖర్‌ స్వీయ రచన, కొరియోగ్రఫీలో రూపొందిన మౌళి ప్రదర్శన పండరీపూర్‌ ఆధ్యాత్మిక వారసత్వం, వార్కరీ సంప్రదాయాల నేపథ్యంతో సాగే ఒక సుదీర్ఘ పరిశోధనాత్మక భరతనాట్య రూపకం అని వివరించారు. భక్తి, సమత్వం, కరుణ, మాతృత్వపు ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ రూపకం ప్రేక్షకులను పండరీపూర్‌ క్షేత్ర తీర్థయాత్ర అనుభూతిలోకి తీసుకెళ్తుందన్నారు. భరతనాట్యం, సంగీతం, సాహి త్యం కథాకథనాల సమన్వయంతో సాగే ఈ ప్రదర్శన ఆధ్యాత్మికతకు సరిహద్దులు లేవనే సందేశాన్ని అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా బాలా దేవి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ భరతనాట్యం ద్వారా సమానత్వం, కరుణ ఆధ్యాత్మిక సమత్వాల అమూల్యమైన విలువలను నేటి తరానికి అందించడమే తన ఉద్దేశంగా ప్రకటించారు. ఆగస్టు 2న భరతకళాక్షేత్ర ఆడిటోరియం వేదికగా జరిగే ఈ ప్రదర్శనకు అందరీకీ ఉచిత ప్రవేశం కల్పించామన్నారు.

ధనుష్‌ ఇంటి వద్ద

అభిమాన సందడి

సాక్షి, చైన్నె: సినీ నటుడు ధనూష్‌ ఇంటి వద్ద మంగళవారం అభిమానులు హోరెత్తాయి. ఆయనకు బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపేందుకు ఎగబడ్డారు.సినీ నటుడు ధనూష్‌ ఇటీవల కాలంగా అభిమాన సంఘానికి ప్రత్యేక జెండా పరిచయం చేయడం, సేవ కార్యక్రమాలు విస్తృతంచేయడం, రాజకీయ వ్యాఖ్యల తూటాలను పేల్చడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఆయన బర్తడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పోయేస్‌ గార్డెన్‌లోని ఇంటి వద్దకు వందలాదిగా అభిమానులు పోటెత్తారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. ఒంటి గంట సమయంలో బయటకు వచ్చిన ధనూష్‌ అభిమానులందర్నీ పలకరించారు. వారి నుంచి ఆశీస్సులు, కానుకలు అందుకున్నారు. అందర్నీ పలకరిస్తూ ఫొటో దిగారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement