శబ్దంతో పాటలు,
వీడియోల
వీక్షణపై నిషేధం..
రవాణా శాఖ నిర్ణయం
ప్రయాణికులకు
మార్గదర్శకాల విడుదల
సాక్షి, చైన్నె: ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు సెల్‌ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడడంపై నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రయాణికులు బ్లూటూత్, ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా తమిళనాడు రవాణా శాఖ కొత్త నిబంధనలను, ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయమై రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి నిర్మల్‌రాజ్, చైన్నె మహానగర రవాణా సంస్థ, ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ, అన్ని రీజినల్ ప్రభుత్వ రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.


