టెస్ట్‌ షూట్‌లోనే ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ షూట్‌లోనే ప్రశంసలు

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

ఎల్‌ఐసీ రిజల్ట్‌ను జీర్ణించుకోలేకపోతున్నా!

తమిళసినిమా: విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వారి అంచనాలు రీచ్‌ కాకపోతే చాలా నిరాశకు గురవుతున్నారు. అలాంటి నిరుత్సాహం నుంచి దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ ఇంకా బయట పడలేదు. నయనతార భర్త అయిన ఈయన తాజాగా రౌడీ పిక్చర్స్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం లవ్‌ ఇన్సూరెన్‌న్స్‌ కంపెనీ. ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, దర్శకుడు అమీర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత నెలలో తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పెద్దగా పొందలేకపోయింది. ప్రదీప్‌ రంగనాథన్‌ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి.ఈ చిత్రం మాత్రం ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. దీనిపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్‌ చేశారు. అందులో కొన్ని చిత్రాలు నెగెటివ్‌ టాక్‌ను అధిగమించి విజయం సాధిస్తాయి. అయితే కొన్ని చిత్రాల పరిస్థితి అలా లేదు. సినిమా రంగంలో ఆదరణ లేని కొన్ని చిత్రాల తలరాత ఇలానే ఉంటుంది. విమర్శలు రాసి తమ తెలివి, ఆధిక్యతను చాటుతున్నారు. ఆ చిత్రాన్ని చూడవద్దు అంటూ దర్శకుని కలలను నలిపేస్తున్నారు. లవ్‌ ఇన్సూరెన్‌న్స్‌ కంపెనీ చిత్ర బాక్సాఫీస్‌ రిజల్ట్‌ను నేను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ చిత్రానికి మొదటి వారం ఆదరణ బాగానే ఉంది. ఆ తరువాత మారిపోవడం చాలా బాధ అనిపించింది. ఇటీవల ఒక దర్శకుడు ఇలా అన్నారు. ఒక చిత్రం విజయం అందులో ఉన్న దానికంటే బయట అధికంగా ఉంటుంది అని అన్నారని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్నారు.

నయనతార,

విఘ్నేష్‌ శివన్‌

తమిళసినిమా: ఎవరికై నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్తుతి కోసం ప్రశంసలు కురిపించినా, నిజమైన ప్రశంసలు ప్రతిభతోనే వస్తాయి. అలా నటి కయదులోహర్‌ టెస్ట్‌ షూట్‌లోనే దర్శకుడు మారిసెల్వరాజ్‌ ప్రశంసలు అందుకున్నారు. బైసన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తరువాత మారిసెల్వరాజ్‌ ధనుష్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి మరి కొంత సమయం పడుతుండడంతో మారి ఈ మధ్యలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మంజనధి అని టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో తన తొలి చిత్రం పరియేరుమ్‌ పెరుమాళ్‌లో నటించిన కదిర్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. అందులో కయదులోహర్‌, ప్రియాంకమోహన్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. ఇందులోని ఒక కథానాయకి పాత్రకు నటి కయదులోహర్‌ సరిగా నప్పుతారా అన్న సందేహం దర్శకుడు మారికి కలిగిందట. దీంతో ఆమెకు మాత్రం టెస్ట్‌ షూట్‌ నిర్వహించారట. అందులో ఆమె నటన చూసి దర్శ కుడు ఫిదా అయినట్లు యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత కయదులోహర్‌ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటిని మరిచిపోయారని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలా టెస్ట్‌ షూట్‌లోనే దర్శకుడు ప్రశంసలు అందుకోవడం ఆమెకు పెద్ద ఎసెట్‌ అవుతుంది. ఈచిత్రంలో మరో కథానాయికి కూడా ఉంటుందని సమాచారం. ఇకపోతే దర్శకుడు మారినే నిర్మాతగా వ్యవహరిసు న్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement