వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇందు లో భాగంగా తిరుత్తణి యూనియన్‌లోని కేజీ.కండ్రిగ లో ప్రభుత్వం లెక్కల ప్రకారం వరి కొనుగోలు పూర్తి చేసినట్లు పేర్కొంటూ కొత్తగా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు వీలుకాదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి విక్రయంకు పేర్లు నమోదు చేసుకున్న 82 మంది రైతులు పంట దిగుబడి చేసి ట్రాక్టర్ల ద్వారా వరి కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి పది రోజులుగా ఎదురుచూస్తున్న అధికారులు కొనుగోలుకు మొగ్గు చూపలేదు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు తమిళనాడు రైతుల సంఘం ద్వారా గురువారం కేజీ,కండ్రిగలో ధర్నా చేపట్టేందుకు వంద మంది రైతులు ఏకమైయ్యారు. వారితో చర్చలు జరిపేందుకు అధికారులు ఆహ్వోనించడంతో ఆర్‌ఐ కార్యాలయం వద్ద రైతులు ఽఊరేగింపుగా వెళ్లారు. రైతులతో తహసీల్దారు కుమార్‌ చర్చలు జరిపారు. తర్వాత వరి కొనుగోలు కేంద్రంలో పేర్లు నమోదు చేసిన రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement