కాదల్ రీసెట్ రిపీట్ ట్రైలర్ విడుదల
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాదల్ రీసెట్ రిపీట్. మాలీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్, డి. స్టూడియోస్, సన్నీ డెన్వీ, డెన్వీ ప్రొడక్షన్‌న్స్ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభ ప్రమోద్‌కుమార్ ఇస్తున్నారు. చిత్రం ద్వారా మధుమ్ కేష్, జియాశంకర్ హీరో హీరోయిన్‌లుగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటుడు అర్జున్ అశోకన్ కీలకపాత్రను పోషిస్తున్న ఇందులో ఎమ్మెస్ భాస్కర్, జయప్రకాష్, విజీ చంద్రశేఖర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని, అరవింద్ కృష్ణ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 6నన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఇది కుటుంబ నేపథ్యంలో సాగే మ్యూజికల్ ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. చక్కని వినోదంతో కూడిన ఫీల్ గుడ్ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర టీజర్, ఆడియోను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. యూ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా రోమియో పిక్చర్స్ సంస్థ చేస్తోందని చెప్పారు.


