చూశాక సంతృప్తి చెందా!
తమిళసినిమా: నటుడు విమల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వడం. నటి సనిష్కా నాయకిగా నటించిన ఇందులో నట్టి, మునీష్‌కాంత్, బాలా శరవణన్, దీప శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.మాసాని పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి కేందిరన్.వి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన వడం మార్చి 6న తెరపైకి రానుంది. చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పగానే నచ్చడంతో చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనకు అవకాశం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు అని దర్శకుడు కేందిరన్ అన్నారు. సంగీత దర్శకుడు డి.ఇమాన్ చిత్రం చేయడానికి అంగీకరించగానే హిట్ ఖాయం అని భావించామని, ఆ తరువాత విమల్ ఓకే చెప్పడంతో మరింత నమ్మకం పెరిగిందన్నారు. విమల్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడు బాగుందని, అయితే దాన్ని ఎలా తెరపై ఆవిష్కరిస్తారోనన్న టెన్షన్ చివరి వరకు ఉందన్నారు. రెండు రోజుల క్రితమే చిత్రం చూశానని, చాలా సంతప్తి కలిగిందని చెప్పారు. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని చెప్పారు. డి.ఇమాన్ అందించిన ఆల్బమ్ చిత్రానికి అదనపు ఆకర్షణ అని విమల్ పేర్కొన్నారు.
చూశాక సంతృప్తి చెందా!
చూశాక సంతృప్తి చెందా!


