1న ప్రధాని మోదీ రాక | - | Sakshi
Sakshi News home page

1న ప్రధాని మోదీ రాక

Feb 26 2026 7:40 AM | Updated on Feb 26 2026 7:40 AM

1న ప్రధాని మోదీ రాక

1న ప్రధాని మోదీ రాక

● మదురై, పుదుచ్చేరిలో పర్యటన ● మార్చి 5న రాహుల్‌ టూర్‌

సాక్షి, చైన్నె: బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఎన్నికల ప్ర చారం నిమిత్తం మార్చి 1వ తేదినప్రధాని నరేంద్రమో దీ పర్యటన ఖరారైంది. మదురై, పుదుచ్చేరిలలో జరిగే బహిరంగ సభలో ఆయనప్రసంగించనున్నారు. అదే సమయంలో మార్చి 5న ఏఐసీసీ నేత రాహుల్‌ గాంది చైన్నెలో పర్యటించనున్నట్టు సమాచారాలు వెలువడ్డా యి. వివరాలు.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో ఎ న్నికల ప్రచారంలో నేతలు దూసుకెళ్తున్నారు. ఓ వైపు పళణిస్వామి నియోజకవర్గాల పర్యటనలను విస్తృతం చేస్తే, బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓ విడత పర్యటనను ఈ ఇద్దరు నేతలు ముగించా రు. మలి విడతగా పీఎం మోదీ మార్చి 1న మదురైలో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఆయన తిరుప్పర గుండ్రం మురుగన్‌ ఆలయంలో పూజలు చేయడానికి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా బీజేపీ ,అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పందేరంపై మిత్ర పక్షాలు ఒత్తిడి పెంచే పనిలో పడ్డాయి. బీజేపీకి 25 సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తమకు 30 సీట్లు ఇవ్వాలంటూ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, పది సీట్ల కోసం తమిళ మానిల కాంగ్రెస్‌, 25 సీట్ల కోసం అన్బుమణి పీఎంకే పట్టుబడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. మిత్రులకే సుమారు వందసీట్లు కట్టబెట్టాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే కూటమిలో ఉండటం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడనట్టు సంకేతాలు వెలువడ్డాయి. మిత్రులందర్నీ బుజ్జగించి సీట్ల పంపకాలను ముగించేందుకు శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ చైన్నెకు రానున్నారు.

రాహుల్‌ పర్యటన..

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ సీట్ల పందేరం ఇంత వరకు అడుగైనా ముందుకు పడలేదు. తమ డిమాండ్‌ను డీఎంకే ముందు కాంగ్రెస్‌ ఉంచినా, కూటమి పెద్ద నుంచి స్పందన లేదు. అదే సమయంలోఆ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ గిరీశ్‌ చోదన్కర్‌ మీడియాతో మాట్లాడుతూ పొత్తుపై వ్యంగ్యంగా స్పందించడం చర్చకు దారి తీసింది. మార్చి 5న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ద్వారా చైన్నెలో బహిరంగ సభకు కాంగ్రెస్‌వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సభకు ముందైనా సీట్ల పందేరాన్ని డీఎంకే తేల్చేనా..? అన్న ఎదురు చూపులలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement