పుదుచ్చేరి ఎన్నికల కసరత్తుల్లో సీఈసీ | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి ఎన్నికల కసరత్తుల్లో సీఈసీ

Feb 26 2026 7:40 AM | Updated on Feb 26 2026 7:40 AM

పుదుచ్చేరి ఎన్నికల కసరత్తుల్లో సీఈసీ

పుదుచ్చేరి ఎన్నికల కసరత్తుల్లో సీఈసీ

సాక్షి,చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల కసర్తులపై సీఈసీ దృష్టి పెట్టింది. బుధవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్‌ వర్గాలు పుదుచ్చేరిలో పర్యటించారు. ఇక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమిళనాడు, పుదు చ్చేరి పర్యటన నిమిత్తం బుధవారం చైన్నెకు ఢీల్లీ నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఏడుగురు ఎన్నికల కమిషన్‌ అధికారుల బృందం చైన్నెకు వచ్చారు. వీరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌తోపాటూ ఇతర అధికారులు విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు. ఇక్కడి నుంచి ఈ బృందం రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి వెళ్లారు. అక్కడి హోటల్‌లో తొలుత అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికలు ప్రశాంత పూరితంగా, సజావుగా జరిగేఅందుకు సహకరించాలని సూచించారు. అనంతరం డీజీపీ, సీఎస్‌తోపాటూ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్య పోలీసు అధికారులు,ఐటీ, ఈడీ, జీఎస్టీఅధికారులతో ఎన్నికల కమిషన్‌ బృందం సమావేశమైంది. ఎన్నికల భద్రత, ఏ ర్పాట్లు తదితర అంశాలను గురించి చర్చించారు. నగదుబ ట్వాడ కట్టడి లక్ష్యంగా ఇక సోదాలు విస్తృతం చేయడానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ బృందం గురువారం చైన్నెకు రానుంది. ఎంఆర్‌ సీ నగర్‌లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో గు రు, శుక్రవారం రాజకీయ పక్షాలు, అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నది. శుక్రవారం సాయంత్రం మీడియాతో జ్ఞా నేశ్‌కుమార్‌ మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement