కారును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ

Feb 25 2026 9:37 AM | Updated on Feb 25 2026 9:37 AM

కారును ఢీకొన్న లారీ

కారును ఢీకొన్న లారీ

– తప్పిన పెనుప్రమాదం

నగరి: మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ ముందు వెళుతున్న కారును ఢీకొన్న సంఘటన మండలంలోని రామాపురం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సోమవారం రాత్రి చైన్నె నుంచి తిరుమలకు ఒక కుటుంబం కారులో వెళుతుండగా రామాపురం వద్ద వెనుకవైపు వస్తున్న సిమెంటు లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ తాకిడికి కారు పక్కకు తిరగగా కారును లారీ పక్క నుంచి ఢీకొంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా మరే వాహనం రాకపోవడంతో కారు రోడ్డుపైనే తిరిగి ఆగిపోయింది. కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్వల్పగాయాలతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించి లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో తూలుతూ కనిపించడంతో స్థానికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement