ఘనంగా శ్రీరామక్కమ్మ ఆరాధన
విజయపురం: మండలంలోని కోసలనగరం మిట్టూరు గ్రామంలో వెలసిన శ్రీరామక్కమ్మ ఆశ్రమంలో మంగళవారం 46వ ఆరాధన ఉత్సవాలు వాసుదేవ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. భక్తులకు ఉదయం నుంచి దర్శన ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఓం రామక్కమ్మ, జయ జయ రామక్కమ్మ నినాదాలతో భక్తులు బృందం, భజనలు నిర్వహించారు. అలాగే కోలాటం, చెక్కభజన, హరికథ, వీధి నాటకం, నృత్య ప్రదర్శన భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.


