చక్రధరుడికి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

చక్రధరుడికి చక్రస్నానం

Feb 25 2026 9:37 AM | Updated on Feb 25 2026 9:37 AM

చక్రధరుడికి చక్రస్నానం

చక్రధరుడికి చక్రస్నానం

శ్రీకాళహస్తి రూరల్‌ : మండలంలోని తొండమాన్‌పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేద పండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పట్టణానికి చెందిన గోపికృష్ణ రమేష్‌ బాబు, రమేష్‌, కార్తీక్‌ ఆధ్వర్యంలో స్వామి వారి వాహన సేవకులకు 40 జతలు పంచ, టవల్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు సూపరింటెండెంట్‌ జ్ఞాన శేఖర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మహేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌, గ్రామస్తులు కందాటి శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం ధ్వజావరోహణం వేడుకగా జరిగింది. వేద పండితులు, ఆల య సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement