విజయవంతంగా జీఎస్టీపై వర్క్‌షాప్
కొరుక్కుపేట: పన్ను విధానాలపై విద్యార్థినుల్లో అవగాహన తీసుకొచ్చేలా రెండు రోజులుపాటు నిర్వహించిన జీఎస్టీ వర్కషాప్ విజయవంతంగా నిర్వహించారు. చైన్నైలోని కన్యకా పరమేశ్వరీ మహిళా కళాశాల, ఐక్యూఏసీ, డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ (హానర్స్), జీఎస్టీ ప్రొఫిషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమ, మంగళవారం జీఎస్టీపై వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఇందులో 275 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జీఎస్టీ సెషన్స్‌ను జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు బాలాజీ అరుణాచలం, ఎ.సేన్‌భగం, జి.శివకుమార్, ఎస్. బాలాజీ పాల్గొని విద్యార్థినులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వనజ, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.భరణికుమారి పాల్గొన్నారు.


