అభిమాన నేతకు ఆహ్వానం
తమ అధినేత వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమం నిమిత్తం చైన్నెకు వచ్చినా, భారీగా అభిమానులు తరలివచ్చి ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. అభిమాన నేతను చూడాలనే ఆశతో ఉదయం నుంచే చైన్నె విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. అలాగే వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్ హుస్సేన్ నేతృత్వంలో ముఖ్య నిర్వాహకులు, నాయకులు ఎయిర్‌పోర్టు వద్దకు తరలి వచ్చారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరులు వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, హరీష్ యాదవ్, సూళ్లూరు పేట మున్సిపల్ చైర్మన్ శ్రీమత్ రెడ్డి తదితరులు విమానాశ్రయం వద్దకు వచ్చి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఈంజంబాక్కంలోని వీజీపీ లే అవుట్ వద్దకు చేరుకున్న అధినేతకు అభిమాన లోకం బ్రహ్మరథం పట్టింది.
అభిమాన నేతకు ఆహ్వానం


