● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం ●భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు ●ఉత్సాహంతో యువత కేరింతలు | - | Sakshi
Sakshi News home page

● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం ●భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు ●ఉత్సాహంతో యువత కేరింతలు

Feb 8 2026 11:17 AM | Updated on Feb 8 2026 11:17 AM

● చైన

● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌

● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం ●భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు ●ఉత్సాహంతో యువత కేరింతలు

సాక్షి, చైన్నె : ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి చైన్నెతో ఉన్న విడదీయరాని బంధం గురించి తెలిసిందే. ఆయన వారసుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చైన్నెకు వచ్చినప్పుడల్లా ఇక్కడ అభిమానం ఉప్పొంగుతుంది. తమ నేతను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున హాజరవుతుంటారు. గత ఏడాది చైన్నెకు వచ్చిన సందర్భంలో తమ అధినేతను దగ్గర నుంచి చూడటమే కాదు, ఆయనతో ఫొటోలు దిగే అవకాశం ఇక్కడి కూడా అభిమానులకు దక్కింది. ఈ నేపథ్యంతో కుటుంబ కార్యక్రమం నిమిత్తం శనివారం చైన్నెలో మరోసారి జననేత వైఎస్‌. జ గన్‌ మోహన్‌రెడ్డి అడుగు పెట్టారు. ఆయన వస్తున్నారనే సమాచారంతో ఇక్కడి అభిమానులు కేరింతలు, ఉత్సాహంతో ముందుకు కదిలారు. చైన్నె ఈస్ట్‌ కోస్ట్‌ మార్గం(ఈసీఆర్‌)లో ఎటు చూసినా పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటారు.

మిన్నంటిన ఉత్సాహం

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ వీజీపీ లే అవుట్‌ చేరుకోగానే మేళ తాళాలను హోరెత్తించారు. బాణసంచా మోత మోగించారు. ఆయన కాన్వయ్‌పై పువ్వుల జల్లు కురిపిస్తూ సందడి చేశారు. మహిళలు సైతం భారీగా తరలి వచ్చి అభిమాన నేతకు నీరాజనం పలికారు. యువత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ వెన్నంటి పరుగులు తీశారు. ఇక ఈంజంబాక్కంలోని వీజీపీ లే అవుట్‌లో ఉన్న సోదరుడు వైఎస్‌ అనిల్‌ రెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేరుకోగానే.. అప్పటి వరకు వేచివున్న అభిమానులు తమ అభిమాన నేతను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో ఇంటిపై నుంచి అందర్నీ అప్యాయంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలకరించారు. దీంతో అభిమానులు కేరింతలు కొడుతూ రెట్టింపు ఉత్సాహంతో సీఎం...సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక ఆదివారం చైన్నెలో జరిగే కుటుంబ కార్యక్రమాన్ని ముగించుకుని సోమవారం బెంగళూరుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది.

● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌1
1/1

● చైన్నెలో జననేత జగనన్నకు నీరాజనం ●ఏపీ మాజీ సీఎం వైఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement