6న వైద్యులు విధుల బహిష్కరణ
తిరువళ్లూరు: ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘఽం ఆధ్వర్యంలో దశల వారిగా ఆందోళనకు పిలుపు నిచ్చింది. తిరువళ్లూరు జిల్లా మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ డాక్టర్ సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రభుశంకర్, కార్యదర్శి నందకుమార్, జిల్లా కోశాధికారి రత్నవేల్‌కుమరన్ హాజరయ్యారు. డాక్టర్ ప్రభుశఽంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ డాక్టర్‌ల సమస్యలను పరిష్కరించాలని దీర్ఘీకాలంగా ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదన్నారు. ప్రభుత్వ వైద్యులకు ప్రతి 5, 10, 15 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ ఇవ్వాలని, పెండింగ్‌లో వున్న వీఆర్‌ఎస్ వినతులను వెంటనే ఆమోదించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డాక్టర్‌లకు ప్రతి నెలా రూ.3వేలు అలవెన్స్‌లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకుంటే ఫిబ్రవరి 2న జిల్లా వైద్య కేంద్రంలో ధర్నా, ఆరున ఓపీ బహిష్కరణ చేసి ఆందోళన చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకుంటే ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు.


