శ్రమకోర్చి చేసిన చిత్రం కరుప్పు పల్సర్
తమిళసినిమా: సినిమా అనేది చాలా మంది కల. మంచి చిత్రాలు చేయాలని, ప్రేక్షకులను అలరించాలి అని ఈ రంగంలో పోరాడుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలా తన సినిమా కలను నెరవేర్చుకోవడానికి పోరాడిన ఒక యువకుడు చేసిన తొలి ప్రయత్రం కరుప్పు పల్సర్.ఈ దర్శక నిర్మాత మురళి క్రిష్.ఎస్.యశో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కరుప్పు పల్సర్. ఈయన దర్శకుడు ఎం.రాజేష్ శిష్యుడన్నది గమనార్హం. ఈయన వద్ద ఒరు కల్ ఒరు కన్నాడి,బాస్ ఎన్గిర భాస్కరన్, శివ మరసుల శక్తి వంటి పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారట. కాగా కరుప్పు పల్సర్ చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్త్ని ఆయన తాను ఈ చిత్రాన్ని తన గురువు ఎం.రాజేష్ భాణిలోనే జనరంజకంగా తెరకెక్కించినట్లు మురుళి క్రిష్ పేర్కొన్నారు. ఈ చిత్ర కథను తన గురువు రాజేష్‌కు చెప్పగా చాలా బాగుందని ప్రశంసించారన్నారు. కాగా ఇందులో నటుడు గెత్తు దినేశ్ ద్విపాత్రాభినయం చేయగా, నటి రేష్మా,మదుమిక కథానాయికలుగా నటించారు. మన్సూర్ అలీఖాన్, శరవణ సుబ్బయ్య, కలైయరసన్ కన్నుసామి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఇది నగర వాతావరణం, పెల్లెటూరి నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్రంలో పల్సన్ బైక్, జల్లికట్టు కాళీలు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. సంగీతం, పాటలను ఇన్బ అందించగా,భాస్కర్ ఆరుముగం ఛాయాగ్రహణం అందించారు. చిత్రాన్ని నిర్మించడానికి చాలా శ్రమ పడినట్లు దర్శకు నిర్మాత మురళి క్రిష్.ఎస్ పేర్కొన్నారు. అయితే నటుడు గెత్తు దినేష్ ఈ చిత్రం కోసం ఎంతగానో సహకిరించారని, అదే విధంగా నటుడు మన్సూర్ అలీఖాన్ తదితర నటీనటులు, సాంకేతిక వర్గం ప్రోత్సాహంతో కరుప్పు సల్సర్ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 30న తెరపైకి రానుంది.
కొందరు
డబ్బు కోసమే
అలా..!
రష్మిక
మందన్న
శ్రమకోర్చి చేసిన చిత్రం కరుప్పు పల్సర్


