ఘనంగా బీవర్ రత్న అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె: బీవర్ అసోసియేషన్ ట్రస్ట్ నేతృత్వంలో బీవర్ రత్న అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. చేట్ పట్‌లోని లేడీ ఆండాల్ కాన్సర్ట్ హాల్ వేదికగా బీవర్ అసోసియేషన్ ట్రస్ట్ నేతృత్వంలో సామాజిక సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా, మెడికల్ రిలీఫ్ ఫండ్ ను ప్రకటించారు. ట్రస్ట్ వ్యవస్థాపకఅ ధ్యక్షుడు భన్వర్‌లాల్ గోతి శతాబ్ది ఉత్సవాలనుప్రారంభిస్తూ, చైన్నె నుంచి చెంగల్పటుట వరకు నివసించే పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య అవసరాలు, సత్వర చర్యల కోసం ఈఫండ్‌ను ప్రకటించారు.
అలాగే ట్రస్ట్ విద్యార్థులకు ఏటా రూ. 25 లక్షలకు పైగా స్కాలర్ షిప్‌లను మంజూరే చేయడానికి నిర్ణయించారు. ఉత్తమ సేవలను అందించిన వారికి బీవర్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ మెడికల్ విభాగం చైర్మన్ అజయ్ నహర్, అధ్యక్షుడు అజిత్ గోతి, ట్రస్ట్ కార్యదర్శి రాజేష్ బోహ్రా, ఉపాధ్యక్షుడు ప్రకాష్, కోశాధికారి అనిల్, జైపూర్‌నుంచి వచ్చిన ప్రతినిధులు శంకుతల గోల్చా, రాజ్‌కుమార్ కొఠారి, సీఆర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.


