క్లుప్తంగా
క్రిస్మస్ పండుగకు సెలవులు
తిరువొత్తియూరు: స్కూల్ విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు నేడు (23వ తేదీ)తో ముగుస్తాయి. ఆ తర్వాత సెలవులు ఇస్తారు. అన్ని స్కూళ్లు తిరిగి జనవరి 5వ తేదీన తెరుచుకుంటాయి. దీంతో విద్యార్థులకు 12 రోజుల సెలవులు లభిస్తాయి. ఈ సంవత్సరం క్రిస్మస్, కొత్త సంవత్సరం గురువారం రావడంతో అర్ధ వార్షిక సెలవులు అదనంగా ఇవ్వబడ్డాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుండే సెలవులు ఇచ్చారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం పండుగలను జరుపుకోవడానికి ప్రజలు నేటి నుండి బయ టి ఊళ్లకు ప్రయాణం మొదలుపెడతారు. సెలవు రోజులను లెక్కించి రైళ్లలో ముందుగా బుక్ చేసుకోవడంతో అన్ని రైళ్లు నిండిపోయాయి. కోయంబత్తూరు మార్గంగా కేరళ వెళ్లే రైళ్లు, బెంగళూరు, దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లన్నింటిలో అన్ని క్లాసులు నిండిపోవడంతో ఆమ్ని బస్సు ఆపరేటర్లు ఎప్పటిలాగే అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు రద్దీ లేకుండా ప్రయాణం చేయడానికి వీలుగా తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. చైన్నె కీళంబాక్కం నుండి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, సేలం, ఈరోడ్, తిరుపూర్ తదితర ప్రదేశాలకు నేటి నుండి 325 బస్సులు మరియు 24వ తేదీన 525 బస్సులు నడపడానికి ప్లాన్ చేశారు. కోయంబేడు నుండి తిరువణ్ణామలై, నాగపట్నం, వేలాంగణి, హోసూరు, బెంగళూరు తదితర ప్రదేశాలకు 23, 24వ తేదీల్లో మొత్తం 91 బస్సులు నడపడానికి ప్లాన్ చేశారు. అలాగే మాధవరం నుండి 20 ప్రత్యేక బస్సులు కూడా నడపనున్నారు. సాధారణంగా ప్రతిరోజూ నడిపే 2025 బస్సులతో పాటు అదనంగా 800 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రభుత్వ బస్సుల్లో రద్దీ లేకుండా ప్రయాణం చేయడానికి www.tnrtc.in మరియు మొబైల్ యాప్ ద్వారా ముందుగా బుక్ చేసుకొని ప్రయోజనం పొందవచ్చు అని ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
రైతు రుణమాఫీ చేయాలి
తిరువళ్లూరు: దేశ వ్యాప్తంగా రైతులు సహకార, జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేయాలని తమిళగ వ్యవసాయ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమిళగ వ్యవసాయ సంఘం ఆద్వర్యంలో తిరువళ్లూరులో భారీ ర్యాలీ, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రధాన కార్యదర్శి ఉదయకుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అద్యక్షుడు వేణుగోపాల్ హాజరయ్యారు. స్థానిక ఎంజీఆర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆయిల్ మిల్ వరకు సాగింది. అనంతరం సమీపంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో సమాశం నిర్వహించారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరను ప్రకటించాలని, పొరుగు రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న ఉత్పత్తి సబ్సిడీలను 20 వేల రూపాయలకు పెంచాలన్నారు. 60 వయస్సు దాటిన రైతులకు పింఛన్, ఉపాధి హామీ పథఽకం కింద కూలీలను 20 శాతం మేరకు వ్యవసాయశాఖకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నేతలు ఉదయకుమార్, రామదాస్, వెంకటేషన్, జయప్రకాష్, మణిగండ తదితరులు పాల్గొన్నారు.
దుకాణాల కేటాయింపునకు
సంబంధించిన కేసు
– మెరీనా బీచ్‌ను పరిశీలించిన
న్యాయమూర్తులు
కొరుక్కుపేట: చైన్నె మెరీనా బీచ్‌లోని దుకాణాల క్రమబద్ధీకరణ , రిజర్వేషనన్‌కు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసులో చైన్నె మున్సిపల్ కమిషనర్, తమిళనాడు పర్యావరణ, వాతావరణ మార్పుల అదనపు ప్రధాన కార్యదర్శి ఇప్పటికే నివేదికలు దాఖలు చేశారు. ఈ నివేదికతో పాటూ దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో తెలిపే డ్రాయింగ్‌లను కూడా దాఖలు చేసిన మ్యాప్‌లో చేర్చారు. అయితే కచ్చితమైన స్థానాల గురించి సమాచారం స్పష్టంగా లేకపోవడంతో న్యాయమూర్తులు అసంతృప్తి చెందారు.దీ ని తరువాత, మెరీనా బీచ్ ప్రాంతంలో దుకాణాల ఏర్పాటును స్వయంగా పరిశీలించాలని న్యాయమూర్తులు ఆర్. సురేష్ కుమార్ , జగదీష్ చంద్ర నిర్ణయించారు. దీని ప్రకారం సోమవారం, మెరీనాబీచ్ న్యాయమూర్తులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో చైన్నె జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్, చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్, ఉన్నత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆ సమయంలో, న్యాయమూర్తులు కార్పొరేషన్ కమిషనర్‌ను వరుస ప్రశ్నలు సంధించారు. బీచ్‌లో ఎన్ని అడుగుల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేస్తారు? అలాంటి దుకాణాలు ఏర్పాటు చేసినప్పుడు, బీచ్‌కు వచ్చే ప్రజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా, శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా సముద్ర సౌందర్యాన్ని ఆస్వాధించగలరా ఆ ప్రాంత పరిశుభ్రత ప్రభావితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి , ప్రణాళికలను అమలు చేయడానికి కూడా వారు పనిచేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ‘బ్లూ ఫ్లాగ్’ అక్రిడిటేషన్ పొందడంపై న్యాయమూర్తులు వివరణాత్మక చర్చ నిర్వహించారు. బీచ్‌లోని అన్ని సౌకర్యాలను తనిఖీ చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా ప్రతిదీ క్రమంలో ఉండాలని వారు చెప్పారు. సర్టిఫికెట్ పొందేందుకు చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు.


