
వేడుకగా అగ్నిగుండ మహోత్సవం
తిరుత్తణి: ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ మహోత్సవంలో భాగంగా వెయ్యి మందికి పైగా భక్తులు అగ్నిగుండం ప్రవేశం చేసి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆర్కేపేట విలక్కనాంపూడి పుదూర్‌లో ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు మే 10న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో చివరిరోజైన ఆదివారం సాయంత్రం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించారు. మధ్యాహ్నం మహిళలు ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం భక్తులు గ్రామ వీధుల్లో గెరిగతో ఊరేగింపుగా ఆలయం వద్ద చేరుకుని అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణల మారుమోగాయి.