మినీ అంబులెన్స్ సేవలు ప్రారంభం
వేలూరు: కాట్పాడి జూనియర్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మినీ అంబులెన్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షులు జనార్దనన్ అన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు జూనియర్ రెడ్‌క్రాస్ సంఘం సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఎన్నికల అధికారులగా పరివాల్, శ్రీనివాసన్‌లు వ్యవహరించారు. ఇందులో నూతన అధ్యక్షులుగా జనార్దనన్, కార్యదర్శిగా శివ వడివు, ఉపాధ్యక్షులుగా విజయకుమారి, కోశాధికారిగా పయణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా వీరితో పాటూ సభ్యులను నూతనంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాట్పాడి కార్యాలయంలో రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించడం, కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తదితర వాటిపై సమీక్షించి తీర్మానించారు. సమావేశంలో సభ్యులు తంగవేల్, ప్రకాష్, డాక్టర్ దీనబందు, రవిచంద్రన్, ఆనంద్‌కుమార్, రాధాక్రిష్ణన్, సెల్వమణి, గుణశేఖరన్, సుధాకర్, ఆరుముగం తదితరులున్నారు.


