కల్తీసారా కేసులో వ్యక్తి అరెస్ట్
పళ్లిపట్టు: కల్తీసారా విక్రయించిన వ్యక్తిని మద్యపాన నిషేధిత విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న కుమారమంగళం వద్ద కల్తీసారా విక్రయిస్తున్నట్లు ఆర్కేపేట మద్యపాన నిషేధిత విభాగం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో వారు ఆదివారం కుమారమంగళం ప్రాంతంలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యక్తి సారా విక్రయిస్తూ రెడ్ హ్యాండడ్‌గా పట్టుబడ్డారు. అతని నుంచి 22 ప్యాకెట్ల సారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి సమీపం సత్రవాడకు చెందిన మునుస్వామి(45)గా తెలిసింది. దీంతో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.


