లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం : ఎస్పీ

సూర్యాపేటటౌన్‌ : శాంతి భద్రతలను పరిరక్షించడం, ప్రజలకు భద్రత కల్పించడమే పోలీస్‌ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

డీఎస్పీ కార్యాలయం తనిఖీ

పోలీసు కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్క నాటారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు రాజశేఖర్‌, వెంకటయ్య, డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల ఎస్‌ఐలు ఉన్నారు.

శివాలయంలో

ప్రత్యేక పూజలు

మేళ్లచెరువు: మండలకేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహలింగార్చన, పుష్పార్చన చేపట్టారు. ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువరర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు.

నెలరోజుల పాటు

పోలీస్‌ యాక్ట్‌ అమలు

సూర్యాపేటటౌన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి 30 వరకు 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీఎస్పీ లేదా ఆ పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి కూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కరల్రు, దుడ్డు కరల్రు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపే ఆయుధాలు కలిగి ఉండరాదని హెచ్చరించారు.

నేడు ఉపాధ్యాయుల ధర్నా

మోతె : సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు కోరు తూ సూర్యాపేటలోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం ధర్నా చేపట్టనున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితెందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement