బుల్లెట్‌ రైలు వచ్చే వరకు దీక్షలు | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు వచ్చే వరకు దీక్షలు

Sep 1 2026 3:06 AM | Updated on Sep 1 2026 3:06 AM

రిలే దీక్ష లో అఖిలపక్ష నాయకులు

సూర్యాపేట : కేంద్రం ప్రకటించిన బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌ను జాతీయ రహదారి వెంట సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు దీక్షలను, ఉద్యమాన్ని కొనసాగిస్తామని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పెద్దిరెడ్డి రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ అన్నారు. బుల్లెట్‌ రైలు సాధన, అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 18వ రోజు కొనసాగాయి. దీక్షలలో సూర్యాపేట రజక జేఏసీ నాయకుడు సట్టు నాగ య్య ఆధ్వర్యంలో రజకులు పాల్గొన్నారు. దీక్షలో రాచకొండ దేవయ్య, దామెర్ల లక్ష్మయ్య, ఏనుగంటి లింగయ్య, రాచకొండ హుస్సేన్‌, గుండారపు శ్రీను, పగిళ్ల వెంకన్న, తాడూరి పద్మ, కొండ్రాసు ఎల్లమ్మ, రేణుక, సంధ్య, గంగరాజు, శ్రీను, సైదులు, అక్కినపల్లి నరసయ్య కూర్చున్నారు. దీక్షలకు అఖిలపక్ష నాయకులు, నేరెళ్ల మధుగౌడ్‌, సీపీఎం నాయకుడు మట్టిపల్లి సైదులు, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు కుర్ర సైదులు, రెడ్డిసంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి

సూర్యాపేట : బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్మెంట్‌ మార్పు వల్ల సూర్యాపేటకు జరుగుతున్న అన్యాయంపై బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం హైదరాబాదులో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఏలేటి మహేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్‌ రైలు మంజూరు చేసింది ప్రజల కోసమని, బుల్లెట్‌ ట్రైన్‌ జాతీయ రహదారి 65 వెంట సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిందేని వారు హామీ ఇచ్చినట్లు కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. వినతిపత్రం వచ్చిన వారిలో అఖిలపక్ష నాయకులు రమణాచారి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్‌, చల్లమల్ల నరసింహ, మండాది డేవిడ్‌ కుమార్‌, కొత్తపల్లి శివకుమార్‌,జీడి బిక్షం, జర్నలిస్టు భూపతి రాములు, మాజీ కౌన్సిలర్‌ వీరేందర్‌, వెలుగు వనిత, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement