హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులతో పాటు జిల్లా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ డాక్టర్ చల్లా వేణు గోపాలరెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డాక్టర్ రమణారావు అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కళాశాలకు చెందిన 37 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరం హైదరాబాద్ రాజేందర్‌నగర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినట్లు తెలి పారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరానికి జరుగుతున్న కౌన్సెలింగ్‌లో 120 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ కళాశాలకు హుజూర్‌నగర్‌లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాలలో విద్యార్థులకు వ్యవసాయంపై, విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్. లింగయ్య, అధ్యాపకులు జి.కిరణ్‌రెడ్డి, సీహెచ్ రమేష్, పద్మశ్రీ, రవి, రాంబాబు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఫ పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్
వేణుగోపాలరెడ్డి
ఫ హుజూర్‌నగర్‌లో అగ్రికల్చర్
కళాశాల ప్రారంభం


