జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా భవ్య | - | Sakshi
Sakshi News home page

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా భవ్య

Sep 1 2026 3:06 AM | Updated on Sep 1 2026 3:06 AM

చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.భవ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. కొదాడ కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ని రోజుల పాటు సూర్యాపేట జిల్లా కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఫర్హీన్‌ కౌసర్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యదర్శికి డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఫర్హీన్‌ కౌసర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement