పూర్వగిరిలో తిరుమంజనం, పురప్పాట్టు సేవ
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మూడో రోజు ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం పురప్పాట్టు సేవ, తిరుమంజన మహోత్సవం, దివ్య ప్రబంధ సేవాకాలం జరిపించారు. పురప్పాట్టు సేవను ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన సేవపై స్వామి, అమ్మవార్ల అధిష్ఠించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు దివ్య ప్రబంధ సేవాకాలంలో నమ్మాళ్వార్ పరమపద ఉత్సవాన్ని జరిపించారు. ఈ వేడుకల్లో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్‌రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. అధ్యయనోత్సవాలు మంగళవారం ఉదయం ముగియనున్నట్లు అర్చకులు వెల్లడించారు.
నేటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు


