పనుల పురోగతి ఇలా..
● మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో రూ.2.45 కోట్లు, కోదాడ మండలం బాలాజీనగర్‌లో రూ.2.33 కోట్లు, మునగాల మండలం ముకుందాపురంలో రూ.2.43 కోట్లతో సబ్‌స్టేషన్ల పనులు ప్రారంభించారు. కాగా ఈ మూడు చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
● సూర్యాపేట మండలం తిరుమలనగర్‌లో రూ.2.53 కోట్లు, మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో రూ.3.17 కోట్లు, పాలకీడు మండలం ఎల్లాపురంలో రూ.3.20 కోట్లు, చిలుకూరు మండలం కొండాపురంలో రూ.2.80 కోట్ల తో చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
కూచిపూడి, చెన్నయ్యపాలెంలో ఆలస్యం
కోదాడ మండలం కూచిపూడిలో రూ.2.59 కోట్లు, మఠంపల్లి మండలం చిన్నాయపాలెంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.58 కోట్లు కేటాయించారు. స్థలం కేటాయింపు జరిగినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుంది. సాంకేతిక లోపం వల్ల పనులు ముందుకు కదలడం లేదు.
పిల్లలమర్రిలో మొదలుకాని పనులు
సూర్యాపేట మండలం పిల్లలమర్రిలో రూ.2.58 కోట్లతో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించడం లేదు. ఇక్కడ పలు సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నా య మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.


