కానిస్టేబుల్‌కు ఉత్తమ సేవా పురస్కారం
మోతె : వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన గురిజాల స్టాలిన్ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడాడు. అతడి సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డును అందించింది. సోమవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్‌యాదవ్ చేతుల మీదుగా స్టాలిన్ ప్రశంసా పత్రం అందుకున్నారు.


