దారిచూపు సైదన్నా..
గట్టెక్కేనా..
శూన్యపహాడ్ మార్గంలో దెబ్బతిన్న రహదారి
శూన్యపహాడ్ వద్ద మూసీ బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతలు
పాలకవీడు: జాన్‌పహాడ్ జాతర దగ్గరకొస్తోంది. సమయం మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. భక్తులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉన్నా అలసత్వం వీడడం లేదు. రహదారులకు మరమ్మతులు చేసి, రక్షణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్లెక్కితే నరకమే..
సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధిగాంచిన జాన్‌పహాడ్ సైదన్న ఉర్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులకు రహదారి కష్టాలు తప్పేలా లేవు. కాలు కదపాలన్నా.. కారు కదలాలన్నా ‘దారి‘.. తెన్నూ లేదు. అడుగుకో గుంత.. ప్రమాదకర స్థితిలో బ్రిడ్జిలు, కల్వర్టులు ఉన్నాయి. ముఖ్యంగా జాన్‌పహాడ్ సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.అదే ప్రాంతంలో మూడు కూడళ్లు నేరేడుచర్ల, మఠంపల్లి, దామరచర్ల మండలాలను కలిపే ప్రాంతం కంకర తేలి ఆనవాళ్లు కోల్పోయింది.శూన్యపహాడ్ మూసీ నది నుంచి సు మారు నాలుగు కిలో మీటర్లు, మూసీ బ్రిడ్జిపై భారీ గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఫ్లై ఓవర్‌పై తరచూ
ప్రమాదాలు
జాన్‌పహాడ్ సమీపంలోని రైల్వే ఫ్లైవర్‌పై పరిస్థితి దారుణంగా తయారైంది. బ్రిడ్జిపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతల వల్ల వాహనదారులు ని యంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.
శూన్యపహాడ్ శివారు మూసీనది నుంచి జాన్‌పహాడ్ దర్గా వరకు గల రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతింది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో రోడ్డంతా గుంతలు, కంకర తేలి ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీనికి తోడు మండల పరిధిలోని ప్రధాన రోడ్లపై ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగాయి. మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల రోడ్లకు ఇరువైపులా ఇసుక మేటలు వేయడంతో వాహనదారులు జారి ప్రమాదాలకు గురవుతున్నారు.
జాన్‌పహాడ్ వెళ్లే
రహదారులు అస్తవ్యస్తం
ఫ ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న జాతర
ఫ వేలాది వాహనాలు వచ్చే అవకాశం
ఫ మరమ్మతులు చేపట్టకపోతే
ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం
జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరగనుంది. వేల సంఖ్యలో భక్తులు వాహనాల్లో తరలివస్తారు. ఈ రద్దీని తట్టుకునే స్థితిలో ప్రస్తుతం రహదారులు లేవు. ఉత్సవాలలోపే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించా లని, రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జాతరకు ఐదు రోజులే గడువు ఉండటంతో ఆలోపు సమస్య పరి ష్కారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దారిచూపు సైదన్నా..
దారిచూపు సైదన్నా..
దారిచూపు సైదన్నా..
దారిచూపు సైదన్నా..


