11ఆర్ కాలువకు మళ్లీ గండి
అర్వపల్లి: మండల పరిధిలోని రామన్నగూడెం శివారు కుడితిగుట్ట సమీపంలో 11ఆర్ కాలువకు మరోమారు గండిపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ 71డీబీఎం కాలువ ద్వారా వస్తున్న నీటి ఉధృతికి కాలువకు ఒక్కసారిగా గండిపడి నీరంతా వృథాగా పోతోంది. నీరు వదిలిన ప్రతీసారి కాలువకు గండ్లు పడడం పరపాటిగా మారిందని రైతులు వాపోతున్నారు.
వరుసగా మూడోసారి..
గత ఏడాది యాసంగి, ఈ వానాకాలం సీజన్‌లో 11ఆర్ కాలువకు గండి పడి పొలాలు మునిగిన విషయం తెలిసిందే. రెండు దఫాలు కూడా అధికారులు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. దీంతో కుడితిగుట్ట సమీపంలో కాలువకు మళ్లీ గండిపడింది. కాలువను పటిష్టం చేస్తేనే పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి ఉంటుందని, లేదంటే నీరు వదిలిన సమయంలో కాలువ సరిగా లేని చోట గండ్లు పడే అవకాశం ఉందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. కాలువ పరిధిలో సుమారు 100 ఎకరాల ఆకట్టు ఉంది.
ఫ వృథాగా పోతున్న నీరు
ఫ కాలువక నీరొదిలిన ప్రతీసారి ఇదే పరిస్థితి


