సాఫీగా.. హ్యాపీగా
ఫ ఆంధ్రాకు సాఫీగా సాగుతున్న వాహనాల ప్రయాణం
ఫ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు
సూర్యాపేటటౌన్ : ట్రాఫిక్ జామ్‌లు, టోల్‌ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణ.. ఇలా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు వాహనాలు రయ్.. రయ్‌మని వెళ్తున్నాయి. వేలకొద్ది వాహనాలు వెళ్తున్నప్పటికీ ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు ఆస్కారం ఉండకుండా డైవర్షన్, యూటర్న్‌లను మూసివేసి సూర్యాపేట మండలం మొదలుకొని కోదాడ మండలం వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తూ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
బ్లాక్ స్పాట్లపై స్పెషల్ ఫోకస్
జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా పరిధిలో 24 బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు.. అక్కడ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సైన్‌బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు రాత్రివేళ తడబడకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో రేడియంతో కూడా తెలుపు రంగు వేశారు. ప్రత్యేక విద్యుత్ లైట్లు, సీసీ కెమెరాలు అమర్చారు. గుంతలు పడిన చోట మరమ్మతులు చేపట్టారు. స్పీడ్ కంట్రోల్ బోర్డులు, బారికేడ్లను తొలగించారు. సూర్యాపేట మండలం టేకుమట్ల జంక్షన్, పిల్లలమర్రి, జనగాం క్రాస్‌రోడ్డు, అంజనాపురి కాలనీ, అంబేద్కర్‌నగర్, జమ్మిగడ్డ క్రాస్‌రోడ్డు, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
కోదాడ పరిధిలో ఇలా..
కోదాడరూరల్ : కోదాడ పరిధిలో కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వరకు 16 కిలో మీటర్ల మేర పోలీసు శాఖ, నేషనల్ హైవే ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జంక్షన్లు, క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొమరబండ వై జంక్షన్, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఫ్‌లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్న దృష్ట్యా సర్వీస్ రోడ్డు విశాలంగా ఉండే విధంగా అడ్డుగా ఉన్న మట్టికుప్పలు, పనులకు సంబంధించిన మెటీరియల్ తొలగించారు. రేడియం స్టిక్కర్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్ల పరి ధిలో ఉన్న వైజంక్షన్, రామాపురం క్రాస్ రోడ్డు వరకు 50 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
సాఫీగా.. హ్యాపీగా


