తెలంగాణ ప్రజలకు తొలి శత్రువు కాంగ్రెస్సే
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రజలకు తొలి శత్రువు కాంగ్రెస్సేనని.. రెండేళ్ల పాలనలో కబ్జాలు, బెదిరింపులు, అరాచకాలు, అక్రమ కేసులు పెరిగిపోయాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా? ప్రజలే తేల్చుకోవాలని, అందుకు సమయం అసన్నమైనదన్నారు. సూర్యాపేటలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు తెలంగాణ ఎట్లున్నది.. కాగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉన్నదో ప్రజలకు అర్థమవుతుందన్నారు. రెండేళ్లలో జనం విసిగిపోయారని.. మోసకారి కాంగ్రెస్‌ను ఓడగొట్టి, అభివృద్ధికి పాటుపడే బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు కంకణబద్దులై ఉన్నారని పేర్కొన్నారు. సంక్రాతికి ముందే పట్టణాల్లో పండుగ వాతావరణం మొదలైని, కేసీఆర్ రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో కనబడుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒంటెద్దు నరసింహరెడ్డి, వై.వి.నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, అన్నపూర్ణ, పుట్ట కిషోర్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా ప్రజలే తేల్చుకోవాలి
ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి


