సవరణలతో మరిన్ని ప్రయోజనాలు
సూర్యాపేట : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టంలో చేసిన మార్పుల వల్ల ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. ఉపాధిహామీ పథకం పేరు మార్పిడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆదివారం సూర్యాపేటలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఒంటెద్దు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఉపాధిహామీ పథకం వేరే రూపంలో కొనసాగగా, ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా మార్పులు చేసి, వికసిత్ భారత్ గ్రామీణ ఆజీవిక మిషన్ గ్యారంటీగా అమలు చేస్తున్నామని తెలి పారు. అనంతరం ఒంటెద్దు శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, దోసకాయల ఫణినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగాచారి, ఆకుల భిక్షమయ్య, కోశాధికారి తాళ్ల నరేందర్‌రెడ్డి, సెక్రటరీ శోభారెడ్డి, మేడబోయిన యాదగిగి, ఐటీ సెల్ కన్వీనర్ కర్ణాకర్, తుక్కాని మన్మథరెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, గజ్జల వెంకటరెడ్డి, రుక్మారావులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి


