గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : 2026–27 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 5వ తరగతికి నూతన విద్యార్థులు, 6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 25 పాఠశాలల్లో బాలబాలికలు ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తు గడువు ఈనెల 21వ తేదీతో ముగియనుందని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
విద్యార్థులు దరఖాస్తులను tgcet.cgg. gov. in, tgswreis.telangana.gov.in, t gtw gurukulam.telangana.gov.in, వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. కులం, ఆదాయం, ఆధార్, బర్త్ సర్టిపికెట్, పాస్ ఫొటో దరఖాస్తుకు సమర్పించాల్సి ఉంటుంది.
సూర్యక్షేత్రంలో వైభవంగా సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని దివ్యమనోహరంగా అలంకరించి అభిషేకం చేశారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
25 నుంచి ఐద్వా మహాసభలు
సూర్యాపేట అర్బన్ : అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)14వ జాతీయ మహాసభలు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరగనున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. ఆదివారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్‌లో మహా సభల వాల్ పోస్టర్‌ను ఐదా నాయకురాళ్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి జాతీయ మహా సభలు జరుగుతున్నాయని, మహిళలు లక్షలా దిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, నాయకురాళ్లు కోట సృజన, వీరబోయిన ఉపేంద్ర, రజియా, ఫాతిమా పాల్గొన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం


