ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతుంటారు. ఊరెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.. పోలీసులు. గత ఏడాది 360 దొంగతనాల కేసులు నమోదయ్యాయి.
పోలీసుల సూచనలు ఇవీ..
● ఇంటి చిరునామా, ఫోన్‌న్ నంబర్ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఇళ్లపై నిఘా ఉంచుతారు.
● కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. కెమెరాలను సెల్‌ఫోన్లను అనుసంధానం చేసుకోవాలి.
● పక్కింటివారికి సమాచారమివ్వాలి.
● విలువైన వస్తువులు ఇంటిలో ఉంచరాదు. విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత, ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. బంగారం, నగదు, విలువైన వవస్తువులు ఉంటే లాకర్ భద్రపరుచుకోవాలి.
● బీరువా తాళాలను తమతో పాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం కనబడకుండా డోర్ కర్టెన్‌న్ వేయాలి. ఇంట్లో లైటు వేసి ఉంచాలి.
● టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. హోం సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచైనా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది.
● స్థానిక పోలీస్‌స్టేషన్ నంబర్, పోలీస్ కంట్రోల్‌రూం నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.
● అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ఫ సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
ఫ గత ఏడాది 360 చోరీ కేసులు
సమాచారమివ్వాల్సిన నంబర్లు
100, 87126 86026


